దత్త చరిత్ర ఎలా పారాయణ చేయాలి

ఎవరు చదవాలి ?
గృహ పీడలు , ఆరోగ్య సమస్యలు , పెళ్లి కాని వాలు , శత్రు బాధలు ఉన్న , దుష్ట శక్తులు వలన భాద పడుతున్నవాలు , లేదా భక్తీ తో కానీ , ఇంట్లో కలోలంగా ఉన్న చేయవచు .

ఎలా చేయాలి /నియమాలు ఏంటి ?
సప్తాహం గ (7 పగలు ) లో దత్త చరిత్ర మొత్తం పారాయణం పూర్తి చేయాలి . దత్త నవరాత్రులు (దత్త జయంతి ) రోజున మొదలుపెట్టి సమాప్తం వరుకు చేయవచ్చు . పారాయణ చేసేటప్పుడు వ్యాస పిట మెడ కానీ మాములు పీట మీద పెట్టి గ్రంధానికి పూజ చేసి . గణపతి కి పూజ చేసి , ఇంటి ఇలవేల్పు ని తలుచుకుని అఖండ దీపం వెలిగించి అనఘా దేవి సహిత దత్తాత్రేయ స్వామి పటం పెట్టుకుని పారాయణ చేయాలి . ఈ అఖండ దీపం పారాయణ పూర్తి అయే వరుకు కొండ ఎక్కకుండా వెలుగుతూనే ఉండాలి .  పారాయణ చేసే వాళ్ళు ఏక భుక్తం చేయాలి . ఉల్లిపాయలు , వేల్లిపాయలు , ముళంగి , మాంసం కానీ తినకూడదు . సాత్వికంగానే ఉండాలి . అబధాలు చెప్పకూడదు , పొరపాటున కూడా మనసులోనయిన శత్రువుల్ని తిట్టకూడదు .
బుసయనం (నేల మీద పోడుకోవాలి ) చేయాలి , బ్రహ్మచర్యం పాటించాలి . నిత్యం ఆ దీపం కొండేక్కకుండా చూడాలి . పారాయణం పూర్తి అయినతరువాత పారాయణ చేసిన గ్రంధం కాకుండా వేరే గ్రంధం పూజ చేసి ఎవరికయినా భోజనం పెట్టి అ గ్రందని దానం ఇవాలి . నిత్యం కానీ తరువాత కానీ ఒక ఫలం నివేదన చేసి హారతి ఇచి అప్పుడు పుస్తకం ముసేయాలి .

దత్త ఆలయం లో కానీ , దేవాలయం లో కానీ , ఇంటి దగర సుబ్రమయిన స్థలంలో కూర్చుని , మేడి చెట్టుకింద కూర్చుని చేయడం విశేషం .

ఆకరి రోజున కలసానికి ఉద్వాసన చెప్పి కొంత మందికి బోజనాలు పెట్టి పూర్తిచేయవచ్చు .