• విష్ణుషట్పదీ స్తోత్రం

  నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

 • శ్రీ రామ

  ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

 • శ్రీ సీతామాత

  త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

 • ఓం నమ:శివాయ:

  చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

 • శ్రీమాత్రే నమః

  అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

 • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

  పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

పాతర్క యోగం అంటే ఏమిటి ?

అలభ్య యోగాలు అంటే అరుదుగా వచ్చే యోగాలు అంటారు . ఇందులో సూర్యుడికి సంబందించి పాతర్క యోగం అంటారు . ఒక రుద్రాభిషేకం చేస్తే ఎంత ఫలితమే అంత ఫలితం వస్తుంది . అలాగే సూర్య గ్రహణం రోజున చేస్తే 1000 అంతలా ఫలిత వస్తుంది . సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశి లోకి మారినప్పుడు మాస సంక్రాంతి అంటాము . రధసప్తమి , రధసప్తమి ఆది వారం రావడం .
పాతర్క యోగం లో చేసే జపం , దానం , హోమం 1000 సూర్య గ్రహణాలో చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుంది . 

యతి పాత అనేది ఆదివారం నాడు వస్తే దానిని పాతర్క యోగం అంటారు . ఈ రోజు శుభకార్యాలు చేయకూడదు . 

ఇంకా చదవండి »

అక్షరాబ్యాసం ఎలా ఎప్పుడు చేయాలి

అక్షరాబ్యాసం 5 సంవత్సరం లో జరిపించాలి కానీ ఇప్పుడు పెద్దవాళ్లు బిజీ గ ఉండడం వలన 3వ ఏటా చేయించడం జరుగుతుంది. అక్షరబ్యాసం ఎవరికీ అయితే చేయిస్తున్నామో వారికీ పోదునే స్నానం చేయించి  కొత్తబట్టలు వేసి ఏమి తినకుండా పోదునే గుడికి వెళ్లి , లేదా ఇంట్లో వర్జ్యం లేకుండా ఉండాలి . 

లగ్నం లో కానీ , దశమం కానీ , పంచమం కానీ , వాక్ స్థానం లో కానీ శని లేకుండా ఉంటె మంచిది శుభగ్రహాలు కేంద్రంలో ఉంటె విశేషం మంచి విద్య  ప్రాప్తి జరుగుతుంది.  మంగళవారం, శనివారం , అమావాస్య తరువాత వచ్చే విదియ పనికి రాదు . తదియ , పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , వర్జ్యం లేకుండా , గ్రహణం లేకుండా , మాస సంక్రాతి కాకుండా చూసుకోవాలి .

అక్షరాబ్యాసం ఈ నక్షతరం లో చేయిస్తే మంచిది : 

ప్రారంభించకూడని తిధి :

పౌర్ణిమ  , అమావాస్య  పాడ్యమి , నవమి , చతుర్దశి , షష్ఠి , మాస సంక్రాతి.

ఈ అక్షరాబ్యాసం చేసిన రోజు పేద పిల్లలికి పాలక , బలపం , pen , pencil , స్కూల్ uniform , లేదా స్పీచులు ఫీజ్ కట్టడం ఇలాంటివి చూసుకోవాలి . మొట్ట మొదటి సరి స్కూల్ లో వేసే టపుడు వర్జ్యం లేకుండా చూసుకోవాలి .

చదువు  బాగా రావాలి అంటే అని గ్రహాలు బాగుండాలి . ఏ గ్రాహం బాగుంటే ఆ గ్రాహం అనుగ్రహించే చదువు చదువుకుంటారు అంటే రవి , చంద్రబలం , పంచమాధిపతి , 9వ స్థానం , పూర్వ పుణ్యం బాగుంటే primary school బాగుంటుంది . రీసెర్చ్ బాగుండాలి అంటే 9, 12, 5 వ స్తతనం బాగుండాలి.

సరస్వతి అనుగ్రహం ఉంటె విద్య బాగా వస్తుంది . నేర్చుకున్న విద్య మరిఒకరికి నేర్పించడం వలన ఆ పుణ్యం ఉంటె ఈ జన్మలో విద్య వస్తుంది . 

ఇంకా చదవండి »

దీపావళి ఎలా జరుపుకోవాలి

లక్ష్మి దేవి పూజ ఎలా చేయాలి ?
తెల్లవారుజామునే స్నానము చేసి కుదిరితే కొత్త బట్టలు లేదా పరిసుబ్రమయిన బట్టలు అయినా వేసుకోవాలి . ఇల్లు అంత పరిశుభ్రం గ ఉండాలి . ఇంటి చుట్టూ దీపమాలికలు వెలిగించాలి. 
రాత్రి పూట గవ్వలు ఆడాలి అని ప్రతీతి. మెమోలు రోజులో ఆడకూడదు కానీ ఈ రోజు మాత్రం గవ్వలు ఆడటం వలన లక్ష్మి దేవి వస్తుంది అని ప్రతీతి . 

ఉపవాసం చేయలేని వారు, మినుములతో చేసిన వంటలు తినాలి. pcos  ఉన్నవాళ్లు మినుములు తినడం వలన గర్బాశయా లోపల శుద్ధి అవుతుంది . మగవాళ్లు తినడం వలన వీర్య వృద్ధి జరుగుతుంది .  బాలింతలు తినడం వలన పాలు సమృద్ధిగా పడతాయి . 

దీపావళి రోజున రాత్రి పూట భోజనం చేయకూడదు. స్నానం చేసి పూజ చేసుకుని మరునాటి రోజున స్నానం చేసి పూజ చేసుకునే వరకు ఉపవాసం చేయాలి. దీపావళి రోజున ప్రొదున్న పూజ అయినప్పటి నుంచి ప్రతి గంటకి స్త్రీ సూక్తం తో అమ్మవారిని పూజ చేసి, నైవేద్యం సమర్పించాలి. ప్రతి గంటకి ఒక సారి స్త్రీ సూక్తం తో పారాయణం చేయాలి మరునాడు ఉదయం మల్లి స్నానం చేసి పూజ చేసుకునే సమయానికి , రోజుకి 24 గంటలు గాబట్టి 24 సార్లు పారాయణం అవాలి. రాత్రి అంతా జాగరణ చేస్తూ స్త్రీ సూక్తం , రాత్రి సూక్తం , లక్ష్మీ పూజ చేయాలి .  అమ్మవారికి నైవేద్యం గ వరి పేలాలు , పూర్ణాలు , పంచ బక్షి పరమాన్నాలు పెట్టాలి .   గోవు ఉన్న చోట తప్పకుండ  దీపాలు పెట్టాలి , పోదున , మధ్యాహ్నం , సాయంత్రం . ద్వాదశి (గోవత్స ద్వాదశి) నుంచి 5 రోజులు , లేదా 3 రోజులు గోవు పూజ చేయాలి . అయితే గోవు పూజ , వ్రతం చేసేవాళ్లు మాత్రం పాలు , నూనె , నేయి , పెరుగు తీసుకోకూడదు . 

ఆముదం తో దీపాలు వెలిగించాలి . ఇంటి బయట లోపల వరుసగా దీపాలు వెలిగించాలి. 
అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉదయం పూజలో ప్రతి ఒక్కరు స్కంద కవచం చదువుకోవాలి. 

ఇంకా చదవండి »

శ్రీకాళహస్తీశ్వర శతకము


.
జలజశ్రీ గల మంచినీళ్లు గలవే చట్రాతిలో , బాపురే
వెలివాడ న్మరిబాపనిల్లు గలదా వేసాలుగా కక్కటా
నలి నారెండు గుణంబు లెంచి మదిలో నన్నేమి రోయంగ ఏ
చెలువంబైన గుణంబు లెంచుకొనవే శ్రీ కాళహస్తీశ్వరా !
.
శ్రీ కాళహస్తీశ్వరా !
ఎక్కడైనా బండరాతి లోపల పద్మాలతో కూడూన మంచినీరు ఉంటాయా !
వెలివాడ లో ఎక్కడైన విప్రగృహం ఉంటుందా ! ఇవి ఉండవనే విషయం నీకు తెలిసి కూడ వేషాలు కాకపోతే నాలో మంచి గుణాలు కన్పించడం లేదని నీవు నన్ను దూరంగా ఉంచడం ఆశ్చర్యంగా ఉంది .

ఏమైనా సరే నాలో ఉన్న గుణాలలో నీకు నచ్చిన దాన్ని ఎన్నుకొని నన్ను రక్షించవలసినది కాని విడిచి పెట్టవద్దని కవి అభ్యర్ధన.
తనకు మోక్షాన్ని పొందే అర్హత ఏ ఒక్కటి లేకపోయినా ,ఉన్న గుణాల్లో శంకరునికి నచ్చిన గుణాన్ని తీసుకొని తనకు మోక్షమివ్వమని కవి ప్రార్ధన . అంటే కవి దృష్టి లో తన వద్ద నున్న ఏకైక గుణం కవిత్వమే. దాన్ని ఏనాడో మహాదేవునకు అంకితం చేశాడు. కాబట్టి తాను కైలాస వాసానికి అర్హుడననే కవి వాదన. 

ఇంకా చదవండి »

సంకల్ప బలం

సుమారు రెండువేల సంవత్సరాల క్రిందట పురాతన గ్రంధములలో ఉల్లేఖించబడిన ఒక కధ వున్నది. అది కధ అయినా దాని వలన ఒక ప్రేరణ మనకు ప్రాప్తిస్తుంది- శ్రీ గౌడపాదాచార్యులవారు తన గ్రంధంలో దీనిని ఉదహరించారు.  ఆ కధ ఏమంటే - సముద్రపు ఒడ్డున ఉన్న రాతి గుహల్లో ఒక చిన్న పక్షి వుండేది. 

అది సముద్రపు ఒడ్డున 
తన గుడ్లు పెట్టుకుంది. ఒకరోజు సముద్రంలో అలలు పొంగి ఆ గుడ్లు కొట్టుకుని పొయాయి. అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ కూర్చోలేదు. ఓదార్చడానికి వచ్చి పోయే వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోలేదు. ఎప్పుడైతే గుడ్లు కొట్టుకు పొయాయో, వెంటనే పని మొదలు పెట్టింది. ఏమి పని మొదలు పెట్టింది. ! తన ముక్కుతో సముద్రపు నీరు నింపుకుని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది. తన గుడ్లు కొట్టుకు పోయాయని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడ అదేపని చెయ్యడం మొదలు పెట్టారు. ఎలాగైనా సముద్రుడిని శుష్కింపచేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు. 

ఇంత చిన్న పక్షి సముద్రుడిని శుష్కింప చేయగలదా చెప్పండి! కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం! దృఢత! పౌరుషం! ఎంతటి ప్రయత్నం. దాని రోమరోమంలో నిండిపోయింది. దేశ దేశాలనుండి పక్షులు రావడం మొదలు పెట్టాయి. మా బంధు మిత్రుడు (పక్షి జాతి) ఒకడు సముద్రుడినే శుష్కింపజేసే దృఢసంకల్పం చేసుకున్నాడట. ఇంత పెద్ద సంకల్పం అంత చిన్నప్రాణి మనసులో ఎంత ఉత్సాహం! ఈ సమాచారం గరుత్మంతుడికి తెలిసింది. 

గరుడుడు పక్షులకు రాజు. సముద్రుడిని శుష్కింపజేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలో నిమగ్నమైవున్నాయట. "పద నేను చూస్తాను" అని గరుడుడు కూడా వచ్చాడు. దీని అర్ధం ఏమిటంటే ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతా పూర్వకంగా చేస్తాడో అప్పుడు సహాయం కూడ తప్పక లభిస్తుంది. యుక్తికూడా దొరుకుతుంది. బుద్ధికూడ స్ఫురిస్తుంది. తన పనిని దృఢంగా చెయ్యగలగటమే కావలసినది. సహాయం చేసేవారు వస్తారు. వివేచన నిచ్చేవాళ్ళు వస్తారు. గరుడుడు వచ్చాడు. అంతా విన్నాక గరుడుడిలా అన్నాడు."ఓ సముద్రమా! మా వారంతా ఇన్నిపక్షులు సంలగ్నమై నిన్ను శుష్కింపజేయాలనుకుంటున్నారు. 

నీవేమో ఇవి నన్నేం చేస్తాయి? క్షుద్రమైన పక్షులు అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాఖా!" అని గరుడుడు సముద్రముపైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు. అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడైనాడు. పక్షి గుడ్లను తెచ్చి ఇచాడు. దానికి తన గుడ్లు లభించాయి.దీని అభిప్రాయం ఏమిటంటే ఎంత పెద్ద పనైయిన సరే సంకల్పించి, మన శక్తికొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు నీకు సహాయం చెసేవాళ్ళు, నీకు సలహా ఇచ్చేవాళ్ళు నీకు లభిస్తారు. అప్పుడు ఆపని చెయ్యడం వలన నీకు సఫలత చేకూరుతుంది. కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు. 

అందుకనే - భగవంతుడంటాడు - 

"ఓ బుద్దిశీలులారా! లేవండి! జాగృతులు కండి. మీ జీవితములో అగ్నిని (తేజస్సు) ప్రజ్వలింపజేయండి. తేజోవంతులు కండి. ప్రకాశవంతులు కండి. ఎట్టిపరిస్థితులలోను, నిరుత్సాహితులు కాకండి. పదండి ముందుకు!  పదండి ముందుకు!! 

ఇంకా చదవండి »

గంగావతరణం(6)

నీటి ప్రవాహానికి అడ్డువచ్చిన మహామహా వృక్షాలే నేలకొరుగుతాయి. భగీరథుని రథం జహ్ను మహర్షి ఆశ్రమం పక్క నుండి వెళ్ళింది. గంగ కూడా జహ్నుమహర్షి ఆశ్రమం పక్కనుండి వెళ్ళింది. గంగాప్రవాహంలో జహ్నుమహర్షి ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆగ్రహించిన జహ్నుమహర్షి గంగను అరచేతిలోకి తీసుకుని త్రాగేశారు. ఎంతో తపస్సు చేయడం వలన మహర్షులకు అంత శక్తి ఉంటుంది. ఇంద్రుడు మొదలైన దేవతల కంటే శక్తిమంతులవుతారు. 

గంగా ప్రవాహ శబ్దం ఒక్కసారి ఆగిపోవడంతో భగీరథుడు వెనక్కి తిరిగి చూసి అవాక్కయ్యాడు. వెంటనే జహ్నుమహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. గంగలో స్నానం చేస్తున్న దేవతలందరూ ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హడలిపోయి వారు కూడా మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. ఎంతో తపస్సు చేసి, నా పితృదేవతల కోసం గంగను భూమికి తీసుకువస్తే మీరు త్రాగేశారు, వారికి ఉత్తమగతులు కలగాలంటే గంగనది వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించాలి అని భగీరథుడు అన్నాడు. దేవతలు కూడా ఆయన ఎంతో తపస్సు చేసి గంగను భూమి తెచ్చారు, చెత్తడం నీటి ధర్మం, మీరు శాంతించి గంగను విడిచిపెట్టండి అన్నారు. 

ఎవరైనా తమకు అపకారం చేస్తే, ఉత్తములకు అపకారం చేసినవారి యెడల కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. మధ్యములకు రెండు ఘడియల కాలం కోపం ఉంటుంది. అధములకు ఒక రోజంతా కోపం ఉంటుంది, కానీ పాపిష్టివాళ్ళకు మాత్రం మరణం వరకు కోపం ఉంటుంది.  అని శాస్త్రం అంటొంది. మహానుభావుడు జహ్ను మహర్షి ఉత్తముడు కనుక ఆయన వెంటనే శాంతించి, భగీరథ నీ కోసం గంగను విడిచిపెట్టెస్తున్నాను అన్నాడు. గంగను తన కుడి చెవిలోనుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవి నుండి పుట్టింది కనుక గంగకు జాహ్నవి అని పేరు. 

మళ్ళీ భగీరథుడు రథం ఎక్కి ముందుకు కదిలాడు, గంగ ఆయన రథాన్ని అనుసరించింది. మళ్ళి గంగలోకి దిగి స్నానం చేసే వాళ్ళు స్నానాలు చేశారు. చివరకు భగీరథుడు తన రథాన్ని పాతాళ లోకంలో తన పితృదేవతల భస్మరాశులున్న ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. గంగ ఆ 60,000 మంది బూడిదకుప్పల మీద నుండి ప్రవహించగానే వాళ్ళందరికి ముక్తి లభించి వాళ్ళ ఆత్మలు స్వర్గలోకాలకు వెళ్ళిపోయాయి. 

వెంటనే బ్రహ్మ దేవుడు వచ్చి నీవు చేసిన తపస్సు వల్ల గంగ భూమికి వచ్చి, వారి భస్మరాశుల మీద నుండి ప్రవహించింది. ఈ భూమి మీద సముద్రములలో నీరు ఉన్నంతకాలం సగరులు స్వర్గలోకంలో ఉంటారని వరమిచ్చాడు.  

ఈ గంగ దేవలోకంలో మందాకిని అని పేరుతోనూ,భూలోకానికి నువ్వు కష్టపడి తీసుకువచ్చావు కనుక భాగీరథి అని పిలువబడుతుంది, పాతాళంలో భోగవతిగాను ప్రసిద్ధికెక్కుతుందని బ్రహ్మదేవుడు భగీరథునితో పలికాడు. దీన్ని ఉద్యేశించే గంగకు త్రిపధగ అనే పేరు వచ్చింది. త్రిపధగ అంటే మూడులోకాల్లో ప్రవహించేదని అర్దం. 

శివుడు గంగను విడిచిపెట్టినప్పుడు గంగ 7 పాయలుగా విడిపోయింది. అందులో మూడుపాయలు తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాయి. వాటికి లాధిని, నళిని, పాధిని అని పేర్లు. మూదు పాయలు పశ్చిమదిక్కుకు వెళ్ళిపోయాయి. సుచక్షువు, సీత, సింధువు అని ఆ 3 పిలువబడుతున్నాయి. మిగిలిన పాయ భగీరథుని వెనుకాల వెళ్ళింది. అదే భాగీరథి. రామాయణంలో చాలా తక్కువ సంఘటనలకు మాత్రమే ఫలశృతి చెప్పారు వాల్మీకి మహర్షి. 

ఫలశ్రుతి 

ఈ గంగావతరణాన్ని ఎవరు వింటారో, చదువుతారో, చెప్తారో, పరమశివుడి తలమీద గంగపడుతున్నట్టుగా ఉన్న చిత్రానికి ఎవరు నమస్కరిస్తారో, గంగావతరణాన్ని మనసులో ధ్యానం చేస్తారో, ఇది ఇలా జరిగిందా? అన్న సందేహం లేకుండా మొత్తం కధను మనసులో ఊహించుకుంటారో, అటువంటి వారికి ఇంతకముందున్న పాపరాశి దగ్ధమవుతుందని, సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని, విశేషంగా శివుని అనుగ్రహం కలుగుతుందని, కోరుకున్న కోరికలే తీరుతాయని, వారికి సర్వవిధ శ్రేయస్సు కలుగుతుందని ఈ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశృతి చెప్పారు.  

ఇటువంటి పరమపవిత్రమైన గంగావతరణాన్ని సోమవారం నాడు పూర్తిచేయడం మరింత పుణ్యప్రదమైనది. 

రామాయణం మనకిస్తున్న సందేశం ఏమిటి? 

ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు భగీరథుడు. తన కోసం కాదు, తన పితృదేవతలను ఉద్దరించడానికి. మనం రామాయణానికి వారసులం, మనం మన తల్లిదండ్రులను నిరంతరం, ముఖ్యంగా పెద్దవయసులో చూసుకోవాలి, వారికి ఆ సమయంలో కావలసినవి ప్రేమలే. వారిని వృద్ధాశ్రమాల్లో పడేయడం, సూటిపోటి మాటలనడం, భారంగా భావించడం లాంటివి చేయకూడదు. కాలక్రమంలో వారు మరణిస్తే వారికి చేసే శ్రాద్ధకర్మ తప్పకుండా ప్రతి సంవత్సరం చేయాలి. అలాగైన మనం వారి జ్ఞాపకాలతో ఒక్క రోజైనా గడుపుతాం. మన తల్లిదండ్రులు, తాతముత్తాతల గురించి ఆ రోజైన మన పిల్లలకు తెలుస్తుంది. 

పర్యావరణాన్ని, ప్రకృతిని, భూమాతను కాపాడుకోవాలి. సాక్షాత్ బ్రహ్మదేవుడే ఈ గంగావతరణంలో చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని భూమాతను భూతాపం నుండి రక్షించాలి. నదులు పవిత్రమైనవి. మనకు తల్లితో సమానం. అందుకే వాటిని కలుషితం చేయకూడదు. హిందూ ధర్మాన్నే ఆచరించండి. " స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ", హిందువుగా జీవించండి. హిందువుగానే మరణించండి.  

ఇందులో అతికొద్ది భాగంతప్ప మిగితాది మొత్తం పూజ్య గురువులు బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి గంగావతరణం ప్రవచనం విని వ్రాసినదే.  

ఇంకా చదవండి »

గంగావతరణం(5)

శివుడు, భగీరథుడు, దేవతలు, బ్రహ్మ అందరూ హిమాలయపర్వతాలకు వెళ్తారు. శివుడు తన రెండు చేతులను నడుము మీద వేసుకుని జటజూటం విప్పి నిల్చున్నాడు. అలా శివుడు తన జటలను విప్పి నిలబడగానే ఆకాశం నుండి క్రిందకు పడమని బ్రహ్మదేవుడి ఆజ్ఞ. 

అందుకని గంగ మంచిప్రవాహంతో ఆకాశం నుండి బయలుదేరింది. చాలా వేగంగా వచ్చేస్తోంది. క్రింద నిల్చున్న పరశివుడిని చూసి నవ్వుకుంది. తన ప్రవాహ బలం తెలియక, శివుడు జటాజూటంలో బంధించడానికి నిలబడ్డాడు, తాను ఒక్కసారి క్రిందకు దూకితే ఆ శివుడి తల బద్దలవుతుందని, ఈ శివుడిని తన ప్రవాహవేగంతో పాతాళానికి ఈడ్చుకుపోవాలని అనుకుంది. తన ప్రతాపం చూపిద్దాం అని మొసళ్ళతో, తాబేళ్ళతో, ఎండ్రకాయలతో, కప్పలతో పడిపోదామని అని నిశ్చయించుకుంది. 

ఈ విషయం పరమశివుడికి తెలిసింది.  అందరిలోనూ ఆత్మగా ఉన్నది శివుడే. మనం చేసే ప్రతి కర్మకు సాక్షి ఆ పరమశివుడు. మనం ఏదో పని చేసి, అది దేవుడికి తెలియదనుకుంటే అది మన అజ్ఞానమే అవుతుంది. మనం చేసే ప్రతిపని, ఆలోచన, మాట్లాడే ప్రతి మాట కూడా ఆ పరమాత్మకు తెలుస్తాయి. . అలాగే పరమశివునకు గంగ మనసులో ఉన్న భావం అర్ధమైంది. గంగ అహకారాన్ని అణచాలనుకున్నాడు. అందుకే హిమాలయాలంతా పరమపవిత్రమైన తన జటాజూటాన్ని(జడలను) పెద్దగా విస్తరించాడు శివుడు. 

అంతే గంగ ఒక్కసారిగా ఆకాశం నుండి శివుడు జటాజూటం లోనికి దూకింది. దూకూతూ నేను శివుడను పాతాళానికి ఈడ్చుకుపోతాననుకుంది. ఒక సంవత్సరం గడిచింది. దేవతలూ, బ్రహ్మ, భగీరథుడు అందరూ గంగ క్రిదకు పడుతుందేమో అని ఎదురు చూస్తున్నారు. ఎంత కాలం చూసినా ఒక్క చుక్క కూడా క్రిందపడలేదు. 

శివుడు విప్పిన జటాజూటాంలో గంగ సుడులు తిరుగుతూ ఒక సంవత్సరంపాటు ఉండిపోయింది. ఎంత నీరు పడినా, ఒక్క చెమటచుక్క పరిణామంలో కూడా గంగ కిందకు పడలేదు. దేవతలు, బ్రహ్మదేవుడు, భగీరథుడు గంగ క్రిందకు పడుతుందని ఆకాశం వైపు చూస్తున్నారు. భగీరథుడు వేచిచూసి బ్రహ్మ దేవుడిని అడుగగా, శివుడు గంగ అహకారం తొలగించడానికి ఆమెను తన జటాజూటంలో బంధించాడని చెప్పాడు.  

మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు భగీరథుడు. తపస్సు చేసి, శివా! గంగ రోషం బాగానే ఉంది. నీ
ప్రతాపమూ బాగుంది. ఇప్పటికైనా గంగను విడిచిపెట్టు అన్నాడు. భగీరథుడి మాటలు విన్న పరమశివుడు గంగను హిమాలయ పర్వతాలలో బ్రహ్మదేవుడి చేత నిర్మించబడిన బిందు సరోవరంలో పడేలా విడిచిపెట్టాడు. శివుడు తన జటాజూటంలో ఉన్న గంగను విడిచిపెట్టాగానే గంగా పెద్దశబ్దం చేసుకుంటూ, మొసళ్ళతో, ఎండ్రకాయలతో, చేపలు, పాములతో సుడులు తిరుగుతూ, మంచి నురుగుతో, ఆ శబ్దం విన్నా, చూసినా భయం వేసేంత ప్రవహంతో గంగ భూమి మీద పడింది.

నదుల యొక్క మార్గాన్ని నిర్దేశించగల అధికారం ఒక్క బ్రహ్మదేవుడికే ఉంది. సృష్టి ప్రారంభంలో ఆయనే నది ప్రవాహ మార్గాన్ని నిర్దేఇంఛాడు. భగీరథుడు రధాన్ని అనుసరించమని గంగను వెళ్ళమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. గంగ భగీరథుని రధం వెనుకాలే వెళ్ళింది. 

మాంచి ఎండాకాలంలో మనకు త్రాగునీరు రానప్పుడు మన ప్రక్కవీధిలోకి ఒక ప్రభుత్వ ట్యాంకరు వస్తోంది అని తెలియగానే, అన్ని పనులు వదిలేసి జనం నీటి బిందేలు పట్టుకుని ఎలా పరిగెడతారో, అదే విధంగా గంగ భూమి మీదకు పడిందనగానే దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషులు, ఋషులు, మునులు, మనష్యులు, పాపం చేసి నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్నవారు, అందరూ ఆ గంగలో స్నానం చేయడానికి, గంగ నీటిని త్రాగడానికి పరుగులుతీస్తున్నారు.  

మహామహా పాతకాలు చేసినవారు గంగలో స్నానం చేయగానే వాళ్ళ పాపరాశి కాలిపొయి మంచి శరీరాలను పొంది దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు.ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేనివారు, ముసలివారు స్నానం చేయడం కష్టమని గంగ నీటిని తలమీద చల్లుకుంటున్నారు. వారు వెంటనే ఊర్ధ్వలోకాలు వెళ్ళీపోతున్నారు. గంగలో స్నానం చేయడం ఆలస్యం, మంచి శక్తులను పొంది, పవిత్రులై ఆకశంలోకి ఎగిరిపోతున్నారు. 

గంగ ఇంత పవిత్రమైంది ఎందుకు? శివుడు శరీరాన్ని తాకింది, ఆయన జటాజూటం నుంచి పడింది. పరమశివుడిని తాకడం వలన గంగ పరమపవిత్రమై, గంగను ఇతర జలాలో స్మరించినంత మాత్రం చేతనే, ఇతర జలాలను కూడా పవిత్రం చేయగల శక్తి లభించింది. 

ముందు భగీరథుడు రథం మీద వెళ్తున్నాడు, ఆయన రథాన్ని గంగ అనుసరిస్తోంది.దేవతలందరూ ఆకాశంలో గంగ ప్రవాహం వెనుక వెళ్తున్నారు. బంగారం వంటి రంగుతో, పెద్ద శబ్దంతో, మంచి పొంగుతో, అలలతో, పక్కన ఉన్న నేలను తుంపర్లతో తడుపుకుంటూ ఆయన ఎటు వెళ్తే గంగ అటు వెళ్తోంది.  

ఇలా సాగిపొతున్న గంగ ప్రవాహం శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిగి చుశాడు కాని గంగ కనిపించలేదు. 

ఇంకా చదవండి »

గంగావతరణం(4)

ఈ 60,000 మంది ఈయన మీదకు పరుగేడుతున్నప్పుడు వచ్చిన శబ్దాన్ని ఆయన విన్నారు.వారు భూమికి చేసిన అపరాధానికి క్రోధంతో అప్పటికే ఉన్నారు కపిల మర్షి రూపంలో ఉన్న వాసుదేవుడు. ఆయన ముఖం కోపంతో ఎర్రబడి, హుంకారం చేస్తూ కళ్ళు తెరిచారు. ఈ 60,000 బూడిద కుప్పలుగా మిగిలిపోయారు. మనకు శ్రీ రామాయణం ఇస్తున్న సందేశం ఏమిటి?  భూమాతను ఎవరు అగౌరవపరుస్తారో, భూమికి అపకారం చేస్తారో, కలుషితం చేస్తారో వారు ఈ రోజు కాకపోయిన ఏదో ఒకరోజు శ్రీ మహావిష్ణువు క్రోధానికి గురవుతారు. 

సగరచక్రవర్తి తన 60,000 మంది సగరుల కోసం ఎంతోకాలం ఎదురు చూశాడు. ఎంతకాలానికి రాకపోయే సరికి తన మనుమడు అంశుమంతుడిని పిలిచి, అశ్వం తిరిగి రాకపోతే యజ్ఞం పూర్తవ్వదు. నేను దీక్షలో ఉన్న అందువల్లు ఇక్కడినుండి కదులరాదు. కనుక ఇప్పుడు నువ్వు పాతాళానికి వెళ్ళు. వెళ్ళెటప్పుడు నీకు విరోధులైన వారు ఎదురుపడచ్చు కనుక ఖడ్గాన్ని, దనస్సు, బాణాలను వెంటతీసుకువెళ్ళు. కాని మార్గమధ్యంలో మహాపురుషులు, గురువులు, పుజనీయులు కనిపిస్తే వారికి నమస్కరించి, పూజించు. ఎవరిని పదితే వారిని వేధించకు, అకారణంగా దూషించకు అని చెప్పి పంపించాడు. 

తాను కూడా రసాతాలానికి బయలుదేరాడు. మొదట తూర్పు దిక్కును మోస్తున్న విరూపాక్షానికి ప్రదక్షిణం చేసి నమస్కరించాడు. అది అంశుమంతుడిని ఆశీర్వదించింది. అలాగే దక్షిణం, పడమర, ఉత్తర దిక్కుల భూభాగాన్ని మోస్తున్న మహాపద్మం, సౌమనసం,భధ్రం అనే ఏనుగులకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి వాటి ఆశీర్వాదం పొందాడు. ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమం కనిపించింది. దానికి ఒక నమస్కారం చేశాడు. ప్రక్కనే గుర్రం గడ్డి మెస్తూ కనిపించింది. దాని తీసుకువెళ్ళడానికి దగ్గరకు వెళ్ళాగానే అక్కడ తన తండ్రి సమానులైన 60,000మంది సగరుల భస్మరాశులు కనిపించాయి. అయ్యో, నా తండ్రి సొదరులైన 60,000 మంది మహర్షి కోపానికి భస్మైపోయారని వాటిని చూసి భోరున విలపించాడు. 

క్రోధాగ్నికి భస్మైపోయారు కనుక వీరికి ఉత్తమ గతులుండవు. వీరు ఊర్ధ్వలోకాలకు, భూలోకానికి మధ్య అంతరిక్షంలో ఎక్కడో వెళాడుతుంటారు. నా తండ్రి సమానులైన వీరికి ఉత్తమ గతులు కల్పించడం కోసం నేను తర్పణం విడుస్తానని అంశుమంతుడు దగ్గరలో నీరు లేకపోతే చాలా దూరం వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. 

అంతలో అంశుమతుడికి మేనమామైన గరుత్మంతుడు కనిపించి, వారిది మామూలు మరణం కాదు, మహాపురుషుడైన కపిల మహర్షి కోపానికి బలైపోయారు. వీరికి మామూలు జలంతో తర్పణాలిస్తే ప్రయోజనం ఉండదు. హిమవంతుడి కూమార్తైన గంగమ్మ యొక్క జలంతో తర్పణలిస్తే తప్ప విముక్తి లభించదు. ఈ 60,000 సగరుల భస్మరాశుల మీది నుండి గంగ ప్రవహించాలి. అప్పుడే వీరికి ఉత్తమ లోకాలు లభిస్తాయి అన్నాడు. 

ఆ మాటలు విని, గుర్రాన్ని తీసుకుని యజ్ఞప్రదేశానికి వచ్చి, సగర చక్రవర్తికి ఈ వార్త చెప్పి, యజ్ఞాన్ని పూర్తిచేశాడు. తన కూమారులకు ముక్తిని కల్పించడానికి సగరచక్రవర్తి చాలా ప్రయత్నం చేశారు కానీ ముసలివారవడం వలన మరణించాడు.  

ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. తన పితరులకు విముక్తి కల్పించడానికి గంగను తీసుకురావాలనుకున్నాడు, కానీ తపస్సు చేయలేకపోయాడు, సగరులకు ముక్తిని కల్పించలేకపోయాడు, కాలక్రమంలో మరణించాడు. తరువాత దిలీపుడు రాజయ్యాడు. చాలా గొప్పవాడు ఈయన. ఈయన ప్రయత్నం చేశాడు కానీ తపస్సు చేయలేదు, గంగను భూమికి తీసుకురాలేదు. 

దిలీప మహారజు తరువాత భగీరధుడు రాజయ్యాడు. ఆయన రాజువుతూనే తన పితృదేవతలను ఎలా ఘొర నరకాలనుండి ఎలా రక్షించాలి, వారికి ఎలా ముక్తిని కల్పించాలని ఆలోచించి, మహారాజు అవ్వగానే రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి బ్రహ్మదేవుడి కోసం తపస్సు మొదలుపెట్టాడు. 

ఎలా తపస్సు చేశాడు? రెండు చేతులు పైకెత్తి, తనకు నాలుగు వైపులా అగ్నిహోత్రాలను పెట్టుకుని, కన్నులు మూయకుండా సూర్యుడినే చూస్తూ, నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటూ, ఇంత బాధ అనుభవిస్తున్నా, తన మనసును, శరీరాన్ని జయించి, వాటి గురించి ఆలోచించకుండా, బ్రహ్మదేవుడి కోసం కొన్ని వేల సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు.  
భగీరథుని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ఒంటరిగా కాకుండా సమస్త దేవతలకు కూడి ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు సంతోషించాను, ఏమి వరం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు భగీరథుడు " నా పితృ దేవతలు కపిలమహర్షి కోపానికి భస్మమై పాతాళంలో పడి ఉన్నారు. వారి మీద నుండి దేవలోకంలో ఉండే గంగ ప్రవహిస్తే తప్ప వారు ఉత్తమలోకాలు పొందలేరు. అందువల్ల గంగా వారి భస్మరాశుల మీదుగా ప్రవహించేలా ఆదేశాలివ్వండి. అలాగే నాకు సంతానం కలగాలన్నాడు ". వరం ఇస్తున్నా అన్నాడు బ్రహ్మదేవుడు. 

నీ రెండవకోరిక ఉందే అది సులువైనది. కాని మొదటి కోరిక, గంగను భూమికి తీసుకురావడం, అది అంత సులభమైన పని కాదు. గంగ భూమి మీద పడితే ఈ భూమి బద్దలవుతుంది. గంగను తట్టుకునే శక్తి ఈ భూమికి లేదు. ఆ గంగను పట్టగల సమర్ధుడు పరమశివుడు ఒక్కడే. అందువల్ల ఆయన గురించి తపస్సు చేయమన్నాడు. 

ఎవరి కోసం భగీరథుడు ఇన్నిన్ని సంవత్సరములు, ఇన్ని సార్లు తపస్సు చేస్తున్నాడు. తన కోసం కాదు. తన పితృదేవతలకోసం. మనిషై పుట్టినవాడి కర్తవ్యం ఏమిటి? పితృదేవతలను ఉద్దరించడం, వారికి ఉత్తమ గతులు కల్పించడం. అందుకే భగీరథుడు గంగను భుమికి రావాలని వరం అడిగాడు. తాను వివాహం చేసుకుని సంతానం పొంది పితృ ఋణం తీర్చుకోవడం కూడా పుట్టిన ప్రతి మనిషి కర్తవ్యం. అందుకే తనకు సంతానం కలగాలని కోరుకున్నాడు. 

మనకు రామాయణం నేర్పుతున్నదేమిటి? కోడుకై పుట్టినవాడు తండ్రి దగ్గర ఆస్తులు తీసుకోవాలని ప్రయత్నించడం కాదు. తన తల్లిదండ్రులు బ్రతికున్నతకాలం వారిని కంటికి రెప్పలా, ప్రేమగా చూసుకోవాలి. వారు మరణిచాక వారికి ఉత్తమలోకాలను కల్పించేందుకు పిండప్రధానం చేయాలి, తర్పణలివ్వాలి, వారి మరణతిధి రోజున వారికి పితృకర్మ చేయాలి. 

కాని ఈ కాలం వారు చేస్తున్నది, బ్రతికున్నప్పుడే తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు, పసివయసు నుండి ఎంతో ప్రేమగా పెంచినా, ముసలివయసు రాగానే తల్లిదండ్రులన చూసూకోవడం మా వల్ల కాదు, వీరితో మేము సర్దుకుని బ్రతకలేమంటూ వారిని తిట్టిపోస్తూ ఇంటిలోనుండి తోసేయడం. బ్రతికిఉండగానే వారిని చంపేస్తున్నారు, నరకం చూపిస్తున్నారు. ఇక వారు చనిపోయాక తర్పణలివ్వడం వృధా ఖర్చుగా భావిస్తున్నారు. రామాయణం చెప్పినవేవి ఆచరించకుండా శ్రీ రాముడి ఆలయలు చుట్టూ తిరుగుతూ, శ్రీ రాముడి దీవెనలు పొందాలని చూడడం మూర్ఖత్వమే అవుతుంది.  

మళ్ళీ భగీరథుడు పరమశివుడి కోసం తపస్సు ప్రారంభించాడు. కాలి బొటనువేలి చివరి భాగం మీద నిలబడి ఒక్క సంవత్సరం తపస్సు చేశాడు. శివుడు త్వరగా వరాలిస్తాడు. అందుకే ఆయన బోళాశంకరుడు, భక్త వశంకరుడని పేర్లు. ఓం నమః శివాయ. ఆయన ఒక్క సంవత్సరానికే ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమవ్వగానే నీకే వరం కావాలి అని కూడా అడగలేదు. గంగను నా తలమీద జటాజూటంలో ధరిస్తాను అన్నాడు శివుడు. అడగకుండానే వరలిచ్చాడు శివుడు. 

ఇంకా చదవండి »

గంగావతరణం(3)

ఏదైన దీక్ష తీసుకునే ముందు చేతికి కంకణం కడతారు. అది దీక్ష పూర్తయ్యేవరకు తీయకూడదు. అటువంటి సమయంలో బంధువుల మరణాల కారణంగా వచ్చిన సూతకం ఆ దీక్షపరుడికి ఉండడు. దీక్ష ముగిసిన తరువాత సాధరణంగా సూతకం ఎన్నిరోజులుంటుందో అన్ని రోజులు పాటించాలి. సగరచక్రవర్తి తన 60,000 మంది సగరులను పిలిచి, తాను కంకణం ధరించాడు కనుక యాగం మధ్యలో లేవకూడదని, ఇంద్రుడు తన పదవి కోసం అశ్వాన్ని దొంగిలించుంటాడు. అందువల్ల భూగోళమంతా గాలించమని ఆజ్ఞాపించాడు. అంతా వెతికినా గుర్రం కనపడక తిరిగివచ్చారు సగరులు. భూగోళమంతాట వెతికినా కనపడలేదన్నారు. 

ఇంద్రుడు అశ్వాన్ని పాతాళంలో దాచిఉంటాడని గ్రహించి మీరు 60,000 మంది ఉన్నారు, ఈ భూగోలమంతా మీ 60,000 మంది 60,000 యోజనాలు వెతకండి అన్నాడు సగర చక్రవర్తి. ఎలా వెతుకుతారో తెలుసా? మీకు వజ్రముల వాంటి గోర్లున్నాయి. ఒక్కొక్కరు ఒక్క యోజనం చొప్పున 60,000 యోజనాల భూమినిలో ఉన్న మట్టిని పెకిలించండి, భూమిని నాగళ్ళు పెట్టి తవ్వేయండి, గునపాలతో చీల్చేయండి, పాతాళానికి వెళ్ళి గుర్రాని తీసుకురండి అన్నాడు సగర చక్రవర్తి. 60,000 మంది భూమిని తవ్వడం, చీల్చేయడం మొదలుపెట్టారు. 

ఇది చూసిన దేవతలు పరుగుపరుగున బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. ఈ భూగోళమంతా దైవశక్తులు ఉంటాయి. పంచమహాభూతాలు (ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి/పృధ్వీ ) ఉంటాయి.  

చెట్లను ఆకారణంగా నరికేయడం, కుదురుగా ఉండలేక పువ్వులు, మొగ్గలు, ఆకులు తెంపడం, పంచభూతాలకు ఇబ్బంది కలిగించడం అంటే కలుషితం చేయడం వంటివి శాస్త్రం నిషేధించింది ( మనం కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. భూమిని రోజురోజుకు వెడెక్కిస్తున్నాం, ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేస్తున్నాం, నదులను, గాలిని, ఆకాశాన్ని, భూమిని కలుషితం చేస్తున్నాం. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నాం, ప్రకృతిని దోచేస్తున్నాం, భూతాపాన్ని పెంచేస్తున్నాం). ఇవన్ని దేవతలు అపచారం చేయడమే. అందుకే పర్యావరణాన్ని పరిరక్షించండి. వారు వారి ధర్మాన్ని పాటించడం మరిచిపోయి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వెళ్ళారు. అందుకే 12 మంది ఆదిత్యులు, 11 రుద్రులు, అష్ట (8) వసువులు, 2 అశ్విని దేవతలు వెళ్ళారు. వీరందరూ కలిపి 33. మొత్తం 33 కోట్ల;దేవతాగణాలు సగరులు చేస్తున్న అకృత్యాన్ని సహించలేక పరుగుపరుగున బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు(వాసు దేవుడు) కపిల మహర్షి రూపంలో ఈ భూమండలాన్ని కాపాడుతున్నాడు. వీళ్ళు చేస్తున్న దుష్కృత్యం వలన ఆయన తపిస్తున్నాడు. 

 ఇలాంటి పనులు చేసేవారి ఈరోజు కాకపోయిన ఏదో ఒక రోజు ఆయన ఆగ్రహానికి గురై భస్మం అయిపోతారు, వాళ్ళు అల్పా ఆయువు కలవారు,  పంచభూతముల జోలికి అనవరసంగా వెళ్ళి, వాటికి అపకారం చేసేవారి ఆయుర్దాయం(జీవిత కాలం) క్షీణిస్తుంది . అందువల్ల మీరు ఆవేశపడకండి అని బ్రహ్మదేవుడన్నాడు, దేవతలు తిరిగి వెళ్ళిపోయారు.  వాళ్ళు అవిధంగా తవ్వి లోపలకు వెళ్తుంటే, వారికి అడ్డువచ్చిన పాములను, మనుషులను, అల అడ్డువచ్చిన ప్రతిజీవిని చంపుకుంటూ వెళ్ళారు. మొదట వారు తూర్పు దిక్కుకు వెళ్ళారు. అక్కడ విరూపాక్షం అనే ఏనుగు ఉంది. అది తన కుంభస్థలం మీద తూర్పు దిక్కున ఉన్న భూమండాలాన్ని మోస్తోంది. మన భూమిని అష్టదిగ్గజాలు మోస్తుంటాయని ఋషులు చెప్పారు. అందులో ఒకటి ఈ విరూపాక్షం. దానికి ఒక్కొక్కసారి దాని కుంభస్థలం నొప్పి పెడితే అది ఒకసారి తన కుంభస్థలాన్ని కదుపుతుంది. అప్పుడు తూర్పుదిక్కున భూకంపాలు వస్తాయని రామాయణంలో ఉంది. దాని చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించారు.  

దక్షిణ దిక్కుకు వెళ్ళారు. అక్కడ మహాపద్మం అనే ఏనుగు దక్షిణ దిక్కున ఉన్నభూమిని మోస్తోంది. దాని చుట్టు ప్రదక్షిణం చేసి, నమస్కరించారు. అటు తరువాత పడమర దిక్కుకు వచ్చారు. అక్కడ సౌమనసం  అనే ఏనుగు పశ్చిమ దిక్కన గల భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం, నమస్కారం చేశారు. అక్కడి నుండి ఉత్తర దిక్కుకు వెళ్ళారు. భధ్రం అనే ఏనుగు ఉత్తర దిక్కు భూమిని మోస్తొంది. దానికి ప్రదక్షిణం, నమస్కారం సమపించారు. అంటే మనమేం అర్ధం చేసుకోవాలి? ఎంత ముఖ్యమైన పని మీద వెళుతున్నా, పరోపకారం చేసేవారు, నలుగురి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసేవారు, గొప్పవారు, పూజ్యులు, దేవతలు కనిపించగానే ముందు వారికి నమస్కరించాలి. వారి ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్ళాలి. 

ఇక వెత్తుక్కుంటూ ఈశాన్య(ఉత్తర-తూర్పు మధ్య ప్రదేశం) దిక్కుకు వెళ్ళారు. అక్కడ తపోవనంలో మహాతేజో మూర్తి కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ప్రక్కనే గుర్రం గడ్డిమేస్తూ కనిపించింది. వాళ్ళనుకున్నారు ఈయనే గుర్రాన్ని అపహరించి ఉంటారు. ఈయనే దొంగ అన్నారు. మనకు రామాయణం ఇస్తూన సందేశం ఏమిటి? ఆధారం లేకుండా ఎవరినిపడితే వారిని, ముఖ్యంగా మహాత్ములను నిందించకూడదు. వారి గురించి లేనిపోని మాటలు మాట్లాడకూడదు. లేనిపోని అభాంఢాలు వేయకూడదు. సుభాషితాలు కూడా అదే అంటూన్నాయి. సాధుపురుషులు, మాహత్ముల జోలికి వెళ్ళి, వారిని ఇబ్బంది పెట్టి, దూరంగా పారిపోయి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. సాధుపరుషులు చేతులు చాలా పెద్దగా ఉంటాయి. ఎంతదూరం పారిపోయిన వారి చేతుల నుండి తప్పించుకోలేరు అంటున్నాయి. అటువంటిది ఈ 60,000 మంది అనవసరంగా ఆయనను నిందించడమే కాదు చేతులలో గునపాలు, నాగళ్ళు ధరించి కపిల మహర్షి మీద దాడి చేయడానికి ఆయన మీదకు దూసుకెళ్ళారు.  

ఇంకా చదవండి »

గంగావతరణం(2)భృగుమహర్షి వద్దకు వెళ్ళి ఎవరికి వశోద్ధారకుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది మహోత్సాహవంతులు జన్మిస్తారో అడుగగా, వారికి ఎవరు జన్మించాలో వారినే కోరుకోమన్నారు భృగువు. 

కేశిని ధర్మం తెలిసినది. కన్నవారిని వదులుకుని, ఇంటి పేరును మార్చుకుని, భర్త వెంట నడిచి స్త్రీ ఎందుకు వస్తుంది అంటే భర్త వంశాన్ని నిలబెట్టాడానికే, తాను సంతానాన్ని కని, తన భర్త వంశాన్ని కొనసాగేలా చేయాడానికే అని ధర్మం చెప్తోంది. అంతేకాదు ఒక తండ్రి అదృష్టవంతుడని ఎప్పుడు అనిపించుకుంటాడంటే, తనకు మంచి సంతానం కలిగి, వారికి సంతానం కలిగి, ఆ సంతానానికి సంతానం కలిగి, వారందరిని తన కళ్ళతో చూసినప్పుడే. ధర్మం తెలిసినది కనుక తనకు వంశకరుడు జన్మించాలని కోరుకుంది. 

సుమతి తనకు 60,000 మంది మహోత్సాహవంతులు కలగాలని కోరుకుంది. ఎంత మంది పుడితే ఏం లాభం. ఒక్కడు పుట్టినా వాడు వంశం పేరు నిలబెట్టేవారు కావాలి, చరిత్రలో నిలిచిపోవాలి. 

మహాతపశ్శాలి, సత్యమే మాట్లాడేవాడు, వేదం అర్ధం సహితంగా తెలిసినవాడూ, వేదాన్ని నిరంతరం పఠించేవాడైన భృగుమహర్షి మాటలు నిజమైనాయి.కొంతకాలనికి వారు గర్భం ధరించారు, ప్రసవించారు. కేశినికి వంశకరుడైన కూమారుడు జన్మించాడు, అతనికి అసమంజసుడు అని నామకరణం చేశారు. సుమతికి ఒక మాంసపిండం నుండి 60,000 వేల మంది చిన్న చిన్న పిల్లలు పుట్టారు. వారు మరి చిన్నగా ఉండడం చేత నేతిభాండములలో పెట్టి వారిని పెంచారు. ఈనాడు మన చెబుతున్న test tube babies, ఇటువంటి గొప్ప శాస్త్రపరిజ్ఞానం త్రేతాయుగంలో, దాదాపు 12 లక్షల సంవత్సరముల క్రితమే మన హిందువులకు ఉంది. వారిని దాదులు(ఆయలు) పెంచి పెద్ద చేశారు. 

అసమంజసుడు, 60,000 మంది పిల్లలు పెరిగి పెద్దవారువుతున్నారు. 60,000 మంది బాగా ఉత్సాహవంతులయ్యారు. ప్రతి పనికి అత్యుత్సాహం చూపించేవారు. ఈ అసమంజసుడికి ఒక దురలవాటు ఉంది. రాజ్యంలో ఉన్న పిల్లలందరిని ఆడుకుందామన్న నెపంతో సరయు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, వారిని నదిలో ముంచి, వారి మీద నిలబడి తొక్కి, ఊపిరి ఆడకుండా చేసి, వారిని చంపి ఆనందించేవాడు. ప్రజలు చాలా కాలం పాటు సహనంతో ఉన్నా, కొంతకాలానికి వారికి సహనం నశించి, వెళ్ళి రాజైన సగరుడికి విన్నవించుకున్నారు.  

ప్రజలందరూ వెళ్ళి సగరుడికి అసమంజసుడి విషయం చెప్పారు. క్షత్రియుల ధర్మం తెలిసినవాడు కనుక, ప్రజలకు హాని చేసేవాడు తన కూమారుడైనా సరే అతనికి తగిన శిక్ష పడాలని అసమంజసుడికి రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు.ఆనాడు లోకకంటకుడు కన్న కొడుకైనా శిక్షార్హుడే అని రాజులు నిరూపించారు. ఒక స్త్రీ మీద పైశాచికంగా అత్యాచారం చేసి, ఆమె చావుకు కారణమైనవారిని ఉరి తీస్తే తమను(వాళ్ళలో చాలామంది, వాళ్ళ పిల్లలూ అత్యాచారలు చేసినవాళ్ళే కనుక)కూడా ఉరి తీయవలసి వస్తుందని వాళ్ళను ఉరి తీయకుండా ఆపిన ఘనత ఈనాటి మన రాజకీయనాయకులది. 

వంశకరుడిని కోరుక్కునాడు కనుక ఈ అసమంజసుడికి ఒక కూమారుడున్నాడు. అతని పేరు అంశుమంతుడు. అతను సగరచక్రవర్తి దగ్గరే ఉండిపోయాడు. అసమంజసుడు అడవులకు వెళ్ళిపోయాడు. 

చాలా కాలం అయిపొయింది. సగర చక్రవర్తి ముసలివాడయ్యాడు. రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం ఆయన అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు. యాగం/యజ్ఞం  ఎక్కడపడితే అక్కడ చేయకూడదు. దానికి శాస్త్రం కొన్ని ప్రదేశాలను చెప్పింది. యాగాలే కాడు ఏ పనైన సరే ఎక్కడ పడితే అక్కడ చేయాకూడదు. హిమాలయాలకు, వింధ్యపర్వతాలకు మధ్య ఉన్న భూమి పరమపవితమైంది. దాన్ని ఆర్యవర్తం అంటారు. అది యజ్ఞభూమి కనుక అక్కడ సగరచక్రవర్తి యాగం చేయాడానికి నిర్ణయించుకున్నాడు. దీక్షపరుడై కూర్చున్నాడు, యాగం మొదలుపెట్టారు, యాగానికి సంబంధించిన అశ్వాన్ని(గుర్రాన్ని) విడిచిపెట్టారు. అది గడ్డిమేస్తూ అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రదేశానికి చేరుకోవాలి. అప్పుడు యాగం పూర్తవుతుంది. చాలా కాలం గడిచిపొయింది. అశ్వం వెళ్ళింది కాని తిరిరాలేదు. 

తన సింహాసనానికి అపాయం వస్తుందన్న భయంతో ఇంద్రుడు ఆ గుఱ్ఱాన్ని తీసుకువెళ్ళి, పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి ప్రక్కన విడిచిపెట్టాడు. 

ఇప్పుడు మనందరికి ఒక అనుమానం తప్పకుండా వస్తుంది. యాగం చేస్తే ఇంద్రుని పదవికి ముప్పెందుకు వస్తుందని. అందరు చెప్తారు ఇంద్రుడు స్వర్గలోకానికి అధిపతి. స్వర్గంలో ఉంటాడాని. ఎక్కడ ఉంది ఆ లోకం అంటే ఎక్కడో లేదు.  మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏ విధంగానైతే నీరు ఆవిరి రూపంలో ఉన్నా మనకు కనిపించదో అదే విధంగా ఎందరో దేవతలు, యోగులు, సిద్ధులు, మహర్షులు, యక్షకిన్నెరకింపురుషులు మన చుట్టూ ఉన్నా ప్రకృతిలోనూ, పర్యావరణంలోనూ, ఈ భూగోళమంతటా మానవనేత్రానికి కనిపించకుండా ఉన్నారు. అందుకే ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని మన ధార్మిక గ్రంధాల్లోనే ఉంది.  

యజ్ఞం ప్రకృతిలో ఉన్న దేవతలను సంతృప్తి పరుస్తుంది. యజ్ఞం చేయడం వలన ప్రకృతిలో చాలా మార్పులు సంభవిస్తాయి. మండు ఎండాకాలంలో, మిట్టమధ్యాహ్నం వేళ, కరువు ప్రాంతంలో కూడా యజ్ఞంతో వర్షం కురిపించవచ్చు. ఇది నిరూపింపబడింది. మీకు నా మీద నమ్మకంలేకపోతే 2-9-1993 నాటి ఆంధ్రజ్యోతి,9-10-1994 ఈనాడు దినపత్రికలు చూడండి. అంటే ఇప్పుడేం జరుగుతోంది. సమస్త ప్రకృతికి అధిదేవత ఇంద్రుడు. అతని ఆజ్ఞానుసారమే వర్షాలు కురుస్తాయి, గాలులు వీస్తాయి. యజ్ఞం చేయడం వలన మనిషి ప్రకృతిలో తనకు కావలసినవి పొందగలుగుతున్నాడంటే అది ఇంద్రుని ఆధిపత్యానికి, సింహాసనానికి గండి కొట్టినట్లే కదా. 

అందుకే ఇంద్రుడు యాగాశ్వన్ని తీసుకుని వెళ్ళి తపస్సు చేస్తున్న కపిల మహర్షి వద్ద విడిచిపెట్టాడు. చాలా కాలం గడిచిపొయింది. అశ్వం వెళ్ళింది కాని తిరిగిరాలేదు. 

ఇంకా చదవండి »

గంగావతరణం

శ్రీ రామాయణంలో బాలకాండలో శ్రీ రాముడు తాటక సంహారం చేశాక విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు శొణా నది తీరం వెంబడి వెళ్తుండగా రాముడు గంగా ఎలా అవతరించిందో చెప్పమని మహర్షిని వేడుకున్నాడు. రాముడికి విశ్వమిత్ర మహర్షి గంగ ఎలా అవతరించిందో సంక్షిప్తంగా చెప్పినా, రాముడు సంతృప్తి చెందక మళ్ళీమళ్ళీ అడిగాడు. తనకు గంగావతరణ ఘట్టం సవివరంగా చెప్పమని ప్రార్ధించాడు శ్రీ రామచంద్రుడు. గంగా ఎలా అవతరించింది, గంగకు "త్రిపధగ" అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమని విశ్వామిత్రుడి పాదాలు పట్టుకుని వేడుకోగా, రాముడి ఆతృతకు, తెలుసుకోవాలన్నా తపనకు చలించిపోయిన విశ్వామిత్ర మహర్షి గంగావతరణం గురించి చెప్పారు. 

విశ్వమిత్ర మహర్షి దానిని రెండు భాగాలుగా రామాయణంలోని రెండు ప్రక్కప్రక్క సర్గలలో చెప్పారు. మొదటి భాగంలో స్కందోద్పత్తి(సుబ్రహ్మణ్య స్వామి జననం)లో కొంచం చెప్పారు. 

హిమవంతుడు(హిమాలయ పర్వతరాజు)కు మేరువు అనే పర్వతం యొక్క కూమార్తే అయిన 'మనోరమ ' భార్య. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూమార్తె గంగా, రెండవ కూమార్తె ఉమ(పార్వతి).
ఉమ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సుచేసి ఆయన్ను వివాహం చేసుకుంది. దేవతకార్యముల కొరకు మాకు మీ పెద్ద కూతురు గంగా కావాలి అని దేవతలు అడుగగా, హిమవంతుడు అంగీకరించి పెద్ద కూమార్తె గంగను దేవతలతో దేవలోకానికి పంపించాడు. దేవతలే గంగను దేవలోకానికి తీసుకుని వేళ్ళారు. అందువల్ల దేవలోకంలో ప్రవహిస్తూండేది గంగ. ఆ సమయానికి భూమి మీద కాని, రసాతలంలో కాని గంగా ప్రవహించేది కాదు. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

ఆ సమయంలో ఆయోధ్య నగరాన్ని సగరుడనే ఒక మహారాజు పరిపాలిస్తూండేవాడు.ఆయన పేరు సగరుడు అంటే విషాన్ని తన శరీరంలో కలిగి ఉన్న వాడని అర్ధం. ఆయన తండ్రి అసితుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఆయన తన భార్యలతో కలిసి హిమాలయ పర్వతాలలో భృగు ప్రశ్రమణము అనే పర్వతం వద్ద తపస్సు చేయడానికి వెళ్ళిన సమయంలో ఆయన భార్యలిద్దరూ గర్భవతులయ్యారు. రెండవ భార్యకు పిల్లలు కలుగకూడదనే ఆలోచనతో మొదటి భార్య విషాన్ని పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న రెండవ భార్య భృగుమహర్షి వద్దకు వెళ్ళి తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని కాపాడమని వేడుకుంది. భృగుమహర్షి మహ తపశ్శక్తి సంపన్నుడు, త్రికాలవేది కనుక ఆయన జరిగినది మొత్తం తన యోగ దృష్టితో గ్రహించాడు. పుట్టేవాడు గొప్పవాడవుతాడని ఆశీర్వదించి, తన శరీరంలో విషం కలిగి పుడతాడు కనుక సగరుడవుతాడని చెప్పాడు. 

అటువంటి సగరుడికి ఇద్దరు భార్యలు. మొడటి భార్య పేరు కేశిని. ఆమె ధర్మం తెలిసినది, ధర్మాన్నే ఆచరించేటువంటి లక్షణం కలిగినది, పతివ్రత, మహాసాద్వి. రెండవ భార్య పేరు సుమతి. మంచి సౌందర్య రాశి.ఈమె గరుత్మంతుడి చెల్లెలు. మొదటి భార్యది అంతః సౌందర్యం, రెండవ భార్యది బాహ్య సౌందర్యం. 

ఇద్దరు భార్యలు ఉన్నప్పటికి సగర చక్రవర్తికి సంతానం కలుగలేదు. కొంతకాలం పాటు సగర చక్రవత్రి, ఆయన భార్యలు సంతోషంతో కాలం గడిపినా, కాలక్రమంలో వారికి సంతానం లేదన్న భాధ మొదలైంది. వంశం నిలబదన్న దుఖం కలిగింది. ఆ కాలంలో ఏదినా సమస్య వస్తే వెంటనే పెద్దలైనవారు, ఋషులు, గురువుల వద్దకు వెళ్ళేవారు. అందువల్ల సగర చక్రవర్తి బృగు ప్రశ్రమణానికి వెళ్ళి నూరు సంవత్సరముల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు ప్రీతి చెందిన భృగుమహర్షి సగర చక్రవర్తి వద్దకు వచ్చి, నీవు గొప్ప కీర్తిమంతుడవు అవుతావు, నీ ఇద్దరు భార్యలలో ఒకరికి వంశకరుడు ( వంశాన్ని నిలబెట్టేవాడు/వంశ వృద్ధిని చేసేవాడు ) అయిన కూమారుడు జన్మిస్తాడు. మరొక భార్యకు మహా ఉత్సాహవంతులైన 60,000 మంది కూమారులు జన్మిస్తారు అని ఆశీర్వదించాడు భృగు మహర్షి. 

ఎవరికి వంశకరుడు జన్మిస్తాడు, ఎవరికి 60,000 మంది కూమారులి జన్మిస్తారో చెప్పలేదు.రాణూలిద్దరికి కుతూహలం పెరిపోయింది. అది తట్టుకోలేక, ఎవరికి వంశకరుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది జన్మిస్తారో తెలుసుకోవడానికి భృగు మహర్షి వద్దకు వెళ్ళారు. 

ఇంకా చదవండి »

ఆవు నెయ్యి గురించిన చిన్న విశేషాన్ని గురించిన వివరం..


గోమాత నామావళిలో హవ్య కవ్య ప్రదాయిని అన్న నామమున్నది. గోఘృతం లేదా ఆవు నెయ్యితోనే దేవతలకు హవిస్సులర్పిస్తాము అలానే పితృదేవతలకు కవ్యమూ.. ఇది అందరకూ తెలిసినదే, ఐతే నిత్యమూ యజ్ఞ యాగాదులు జరిగేచోట, ఆవు నెయ్యి ఇతర సమిధలతో కాలి ఆవిరి అయ్యిన చోట రేడియోధార్మిక పదార్థాల యొక్క విషపు గాలులయొక్క ప్రభావం నామమాత్రం లేదా అసలు ఉండదని రష్యన్ శాస్త్రజ్ఙ్యులు డా శిరోవిచ్ తమ పరిశోధనలో తెలిపి నిరూపించారు. మనవాళ్ళు చెప్తే నమ్మని మన వారు ఇతరులు చెప్పినా కొన్ని సార్లు సనాతన ధర్మ గొప్పదనాన్ని ఒప్పుకోలేరు. 

ఈ విషయం 1980వ దశకంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదమైన భోపాల్ గ్యాస్ విషవాయువులు, రేడియోధార్మికశక్తిల వలన ఆ ప్రాంత చుట్టూ ఐదారు మైళ్ళ వరకూ అత్యంత ఉపద్రవంతో కూడిన వ్యాధులు సోకాయి, ఎందరో చనిపోయారు, కొందరికి చర్మం కాలిపోయింది, ఇప్పటికీ ఆ ప్రాంతం వారిలో కొంతమందికి ఆ రసాయనాల వల్ల కలిగిన రోగాలను పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నారు. ఇంత అత్యంత దారుణ బాధాకరవిపత్కర పరిస్థితులలో ఈ ప్రమాదం సంభవించిన కర్మాగారానికి ఒక మైలులోపు ఉన్న రెండు కుటుంబాలకు మాత్రం ఎటువంటి హానీ జరగలేదు, ఎవరి ప్రాణాలకీ ముప్పు కలగలేదు, కనీసం ఎవరూ అనారోగ్యం పాలు కాలేదు. కారణం ఈ రెండు కుటుంబాలు నిత్యాగ్నిహోత్రీకులు అగ్నిహోత్రంలో రోజూ ఆజ్యంవేసి హవిస్సులర్పిస్తారు. వారి పేర్లు వివరాలతో సహా ఆంగ్ల దిన పత్రిక "ద హిందూ" 4-May-1985 నాడు "Vedic way to Beat Pollution" అన్న శీర్షికన ఈ కథనాన్ని ప్రచురించింది. 

ఆ ఇద్దరు ఇంటి యజమానులు శ్రీ సోహన్ లాల్ ఎస్.ఖుశ్వాహ, శ్రీ ఎమ్ ఎల్ రాథోర్ గార్ల పేర్లను ప్రస్తావిస్తూ ఆ ఆర్టికల్ ప్రచురించబడింది. సనాతన ధర్మంలో ఏ కార్యం చేసినా ప్రకృతి ప్రసాదాన్ని చెడగొట్టుకునేలా ఉండవు అన్నీ ప్రకృతికి అనుగుణంగానే చేయబడతాయి, ప్రకృతియొక్క అనుగ్రహంకోసమే చేయబడతాయి, యజ్ఙ యాగాదులు కాలుష్యాన్ని పెంపొందించవు, పైగా అవి వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని తగ్గిస్తాయి అని మన పూర్వీకులు 
చెప్పినదే పాశ్చాత్య ఇతర దేశాల శాస్త్రవేత్తలూ తమ పరిశోధనలచేత నిర్ధారించారు. ఐనప్పటికీ వీటిమీద అధ్యయనం చేసే వైపుగా కానీ, చక్కని ప్రచారం కల్పించడం కానీ మనవారికి చేయడం చేతకాదు. ఏది ఏమైనప్పటికీ... మన సనాతన ధర్మపు విలువలను నిత్య విధులను పట్టుకుని 
నిత్యాగ్నిహోత్రీకులై భోపాల్ గ్యాస వంటి దురదృష్టకర ప్రమాదాన్ని తేలికగా ఎదుర్కుని మన వైదిక సంస్కృతి గొప్పదనాన్ని చాటిని ఆ ఇద్దరు కుటుంబీకులకు వారి వంశానికి ఆ పరాదేవత గోమాత అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది అని ఆశిస్తూ . 

ఇంకా చదవండి »

అమర్నీతి నాయనారు


అమర్నీతి నాయనారు చోళరాజ్యమున ప్రసిద్ధినందిన పజైయ్యరాయికి చెందిన వైశ్య కులజుడు. అ గ్రామం చాలా సారవంతమైనది. చుట్టూ తోటలతో లతలతో పచ్చగా శోభాయమానంగా ఒప్పుతూండేది. అమర్నీతి నాయనారు బంగారం, రత్నాలు, పట్టు వస్త్రముల వ్యాపారి. విదేశాలనుండి వస్తువులను తెప్పించి వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన ఆర్జన ఎంతో నీతిమంతముగా ఉండేది. వ్యాపారం కలిసి రావడంతో మంచి ధనవంతుడయ్యాడు. వ్యాపారము చేస్తున్నా, ఇహలోక వ్యాపకాలున్నా, నాయనారు మనసు శివుని మీదే వుండేది. పరమశివ భక్తుడు. శివభక్తులను తన గృహమునకు పిలిచి వారిని అర్చించేవాడు. వారలకు కౌపీనము, దుస్తులు మొదలగునవి ఇచ్చి, షుష్టుగా భోజనము పెట్టి, ఏమైనా కానుకలు ఇచ్చి, వారు సంతసించునట్లుగా చేసి సాగనంపేవాడు. 
  
పండుగలలో పబ్బాలలో తిరునల్లూరు దేవాలయమునకు దైవ దర్శనమునకు వెళ్లేవాడు. అక్కడ శివుని ముందు భావయుక్తంగా పంచాక్షరిని జపిస్తూ శివుని అర్చించేవాడు. కొన్నాళ్లకి పండుగలకు మాత్రమే తిరునల్లూరు దేవాలయమునకు వెళ్ళటంతో సంతృప్తినందక - ఆ వూరిలోనే నివసిస్తే - నిరంతరము శివ దర్శనము చేయవచ్చని, శివభక్తుల సేవకు వీలవుతుందని తలచి - తిరునల్లూరుకు తన బంధువులతో సహా వెళ్లి, అక్కడే స్థిరపడి - దైవదర్శనమునకు వచ్చెడి  శివభక్తులకు వుండుటకు వీలుగా ఒక మఠం కట్టించాడు. ప్రతి దినము వారిని తన ఇంటికి పిలిచి, వారలకు కౌపీనము మొదలగునవి ఇచ్చి సంతసింపజేసేవాడు. 

నాయనారు భక్తితత్పరతకు పరమశివుడు పరవశించి పోయాడు. ముఖ్యముగా కౌపీనములను ఇచ్చుచుండుట, శివభక్తులయెడ వాత్సల్యము, ఔదార్యము శివుని ఆకర్షించినవి. అతని ఔదార్యాన్ని అందరిచేత ప్రశంసింపజేయాలని, అతనికి తన శుభాశీస్సులను ఇయ్యటానికి శివుడు నిశ్చయించాడు. అందుకని ఒకరోజున బ్రహ్మచారి వేషంతో జటతో, విభూతి పుండ్రములు, భుజం మీద దండంతో శివుడుఅమర్నీతి నాయనారు  మఠంకి విచ్చేశాడు. బ్రహ్మచారి దండానికి చివర 2 కౌపీనములు, విభూతిసంచి కట్టబడి వున్నాయి. ఆయన ముఖం తేజోవంతంగా ఉంది. కళ్లు ప్రకాశమానంగా వున్నాయి. ఠీవిగా మఠంలోకి ప్రవేశించాడు. అమర్నీతి నాయనారు పరమానందంతో అతిథిని ఆహ్వానించి అర్చించాడు. బ్రహ్మచారి - అమర్నీతి నాయనారుతో, "మీరు మహాత్ములు. ప్రతి ఒక్కరు మీ దానాలకి, ముఖ్యముగా కౌపీనముల దానాలకు మిమ్మలను అభినందిస్తున్నారు. మీ దర్శనానికి వచ్చాను." అని అన్నాడు. అమర్నీతి నాయనారు - బ్రహ్మాచారిని తన వద్దనుండి బిక్షను స్వీకరించవలసిందిగా అర్థించాడు. బ్రహ్మచారి ఒప్పుకొని, "నేను నదికెళ్లి స్నానము చేసి నిత్య కర్మానుష్టానము చేసి వస్తాను. వర్షము వస్తోంది. వర్షమునకు నా కౌపీనములు తడిసిపోయాయి. అందుకని ఈ పొడి కౌపీనమును జాగ్రత్త పరచండి. నేను వచ్చి తీసుకుంటాను. అది చాలా విలువైంది, ప్రత్యేకమైనది గూడ. అందుచే దానిని భద్రముగా ఉంచండి" అని చెప్పి స్నానానికి నదికి వెళ్లాడు. 

బ్రహ్మచారి నదికి వెళ్లాడు. అమర్నీతి నాయనారు ఆ కౌపీనమును భద్రపరిచాడు. పరమశివుడు దానిని మాయం చేశాడు. బ్రహ్మచారి స్నానము చేసి వచ్చి, తన పొడి కౌపీనమును ఈయమని కోరాడు. తన రెండో కౌపీనము వానకు తడిసిపోంది. అందుకని పొడిదానిని అడిగాడు. అమర్నీతి నాయనారుకు  తాను భద్రపరచినచోట కౌపీనము కనిపించలేదు. అంతటా వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. అందుకని వణుకుతూ బ్రహ్మచారికి ఇంకొక కౌపీనముతో నిలబడి పరిస్థితిని చెప్పాడు. బ్రహ్మచారి నాయనారు మాటలను అంగీకరించలేదు. వినలేదు. నాయనారు చాలాధనము దానికి బదులుగా యిస్తానన్నాడు. బ్రహ్మచారి, "ధనాన్ని నేనేమి చేసికొంటాను? అవసరం  లేదు, నా అవసరం కౌపీనము మాత్రమే" అన్నాడు. బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు. "మీకు కౌపీనము కనిపించనిచో, నా ఇంకో కౌపీనమునకు సరితూగే వేరొక కౌపీనమును ఈయండి" అన్నాడు. అమర్నీతి నాయనారుకు కొంచెం స్వస్థత కలిగింది. వెంటనే త్రాసును తెప్పించాడు. బ్రహ్మచారి కౌపీనమును ఒక తక్కెటలో ఉంచాడు. రెండో తక్కెటలో తాను ఇవ్వదలచిన కౌపీనమును పెట్టాడు. బ్రహ్మచారి కౌపీనమే ఎక్కువ బరువు చూపింది. అమర్నీతి నాయనారు ఏమిపెట్టినను బ్రహ్మచారి కౌపీనమే బరువుగా కనిపించింది. అమర్నీతి నాయనారుకు ఆశ్చర్యము కలిగింది. ఇదంతా శివలీలయని గ్రహించాడు. తన సంపద యావత్తు బ్రహ్మచారి కౌపీనమునకు సరితూగలేదు. పరమ శివుని కౌపీనము వేదమును తలపింపజేస్తుంది. దాని పోగులు శాస్త్రాలు.  

అమర్నీతి నాయనారుకు ఏమీ పాలుపోలేదు. బ్రహ్మచారి కాళ్లమీద పడ్డాడు. "స్వామీ! నన్ను, నా భార్యను, నా పుత్రుని గూడ మీ కౌపీనమునకు సమమవుతాయేమో తూచండి" అని అర్థించాడు. బ్రహ్మచారి అందుకు అంగీకరించాడు. అమర్నీతి నాయనారు తన కుటుంబముతో సహా తక్కెటలో కూర్చుంటూ, "నేను శివభక్తులను భక్తితో, చిత్తశుద్ధితో, సేవించుచున్నట్లయితే, ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక" అన్నాడు. త్రాసు ఆశ్చర్యకరంగా సరితూగింది. అమర్నీతి నాయనారు పుణ్యం బ్రహ్మచారి కౌపీనమూనకు తుల్యమయింది. అచ్చట చేరిన ప్రజలందరూ ఆశ్చర్య చకితులయ్యారు. వారు అమర్నీతి నాయనారు పాదములపైబడి ప్రశంసించారు. దేవతలు  ఆ  కుటుంబముపై పారిజాత సుమ వృష్టి కురిపించారు. బ్రహ్మచారి అంతర్థానమైనాడు. పార్వతీపరమేశ్వరులు వృషభ వాహనముపై ప్రత్యక్షమై, నాయనారును అనుగ్రహించారు. పరమేశ్వరుడుఅమర్నీతి నాయనారును ఉద్దేశించుచు, "నీ కౌపీన దాతృత్వము, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని అలరించాయి. నీవు, నీ భార్య, నీ పుత్రుడు - ముగ్గురూ నా లోకంలో శాశ్వతంగా నివసించండి" అన్నారు. శివానుగ్రహం వల్ల తక్కెడ దివ్యవిమానంగా మారి,అమర్నీతి నాయనారును, అతని భార్యను, మఱియు అతని పుత్రుని శివలోకానికి చేర్చింది. 

ఇంకా చదవండి »

మహా శివ రాత్రి రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి ?

శివ సందర్బంగా పాటించవలిసిన పర్వటి రోజులు అనేకం ఉన్నయి. మాస శివరాత్రి , అమావాస్య ముందుగ వచ్చే చతుర్దశి రోజు , సోమవారం , ఆర్ద్ర నక్షత్రం రోజు , మాస సంక్రాంతి రోజు , దక్షిణాయన పుణ్యకాలం , ఉత్తరాయణ పుణ్యకాలం , జన్మ నక్షత్రం రోజు , గ్రహణ సంమయం  ఇవి విసేషమయిన రోజులు . 

వీటిలో ముక్యమయిన రోజులు శివరాత్రి .


శివరాత్రి ఎన్ని రకాలుగా చేస్తాం ?
నిత్య శివరాత్రి , పక్ష శివ రాత్రి , మాస శివ రాత్రి , మహా శివరాత్రి , యోగ శివ రాత్రి .

నిత్య శివరాత్రి - నిత్యం ఉపవసించి ప్రదోష కాలం లో శివుడికి పూజ చేసి మరునాడు పారణ చసి , రాత్రి జాగరణ చేసే వాళ్ళు .

పక్ష శివ రాత్రి - పౌర్ణిమ ముందు వచ్చే చతుర్దశి , అమావాస్య ముందు వచ్చే చతుర్దశి కూడా ఈశ్వరుడ్ని అర్చించి ఉపవసించి , శివ రాత్రి రోజు ఎలా చేస్తారో అలాగే చేస్తారు .

మాస శివ రాత్రి -

మహా శివరాత్రి - మాఘ బహుళ చతుర్దశి రోజు మహా శివ రాత్రి . ఈ సివారతి రోజు అర్ద రాత్రి లింగోద్భవం గ చెపుతారు . ఈ రోజే శివ పార్వతులకి కళ్యాణం కూడా చేస్తారు . శివుడికి పూజ చేయటానికి అత్యంత విసెషమయిన రోజు .

మహా శివరాత్రి రోజున ఎం చేయాలి ?

పగలు రాత్రి కూడా శివ నామం జపించటం . ప్రత్యేకం గా దీపారాధన చేయటం అంటే కార్తిక పౌర్ణిమ కి ఎలాగా 360 వత్తులు వెలిగిస్తమొ అలాగే ఈ రోజు కూడా వెలిగిస్తారు, లేదా 11 వరసలు కల వొత్తులు తో దీపం పెట్టె పద్దతి , లక్ష వత్తులు తో దీపం , మొతం శివాలయం లో దీపాలు వెలిగించే పద్ధతి సాంప్రదాయం ఉంది .

దగర్రలొ ఉన్న నది లో స్నానం చేయటం . నది దగ్గర సైకత లింగం చేసి పూజ చేయటం . సముద్రం లో కి నది కలిసే చోట స్నానం చేయటం లేదా రెండు నదులు కలిసే చోట స్నానం చేయటం  లేదా నది లో స్నానం చేసిన విశేషం. సూర్యోదయ కాలము నుండి నిరంతర శివ నామ స్మరణ చేయడం , శివ ధ్యానం లో ఉండడం. పూజ , ధ్యానం నామ స్మరణ , సంకీర్తనం , శివ తాండవం , నాట్యం . 

ప్రళయ కాలం లో చీకటి ,ఘడాంతకారం గ ఉన్నపుడు , మల్లి సృష్టి ప్రరమ్బించలి అని పార్వతి దేవి శివుడ్ని గురించి ప్రార్ధన చేసింది . అ సమయం లో శివుడు అనుగ్రహించి సృష్టి జరిపించి , లింగొద్బవమ్ అయిన సమయం కాబటి అ రోజున మహా శివరాత్రి అయింది . పార్వతి దేవి శివానుగ్రహం కలిగిన తరువాత శివుడ్ని కోరింది - ప్రతి శివరాత్రి రోజు రాత్రి ఎవరు నిన్ను అర్చిస్తారో , అభిషేకిస్తారో వారిని అనుగ్రహించాలి అని.

మరి ఒక కధనం ప్రకారం శివుడు లింగ రూపం దాల్చిన కారణం గ ఎవరు ఈ శివరాత్రి రోజు శివుడ్ని పూజ / స్మరణ  చేస్తూ రాత్రి జాగరణ చేస్తారో వారిని కష్ట కాలం నుంచి కాపాడతాను అని స్వయం గ శివుడే వివరించాడు . 

ఇంకా చదవండి »

భారతీయ గ్రంధాలు


 చారిత్రిక భారతదేశం లో విద్య లో భాగంగా ఏడు అంశాలు ఉండేవి.
1.వేదం
2.స్మృతి
3.దర్శన శాస్త్రం 
4.పురాణాలూ 
5.శంకరాచార్య ప్రవచనాలు.
6.ఇతిహాసాలు,
7.భగవద్గీత.

1.వేదం వేదాలు నాలుగు.మొదట అన్ని వేదాలు కలిసి ఇకే వేదంగ ఉండేవి.ద్వాపర యుగం లో వేద విభజన వ్యాసుడి ద్వార జరిగింది.తద్వారా చతుర్వేదలుగా విభజించబడ్డాయి. 

ప్రతీ వేదంలో నాలుగు భాగాలుంటాయి.
మంత్రసంహిత,
బ్రాహ్మణము,
ఆరణ్యకము మరియు 
ఉపనిషతులు.

1).సంహితం:- "సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై" - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. "సంధి" అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు.  వేదమునందలి శాస్త్రమును సంధించునది సంహితము. 

(సంహితమ్ = కూడుకొనునది) వేద సంహిత అంటే మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే  రచన కాదు.  అంటే వేద ద్రష్టలైన ఋషులు వీటిని రచించలేదు (వేదాలు "అపౌరుషేయాలు"). వీటిని దర్శించి, స్మరించి, కూర్చారు.

"సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. 
ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు.
యజుర్వేదంలో యజుస్సులు
సామవేదంలో సామాలు
అధర్వవేదంలో అంగిరస్లు అనబడే మంత్రాలుంటాయి. 

యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు.
ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని,
 యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని,
 సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని,
 అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.

2).బ్రాహ్మణాలు:- సంహితలోని మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది. యజ్ఞయాగాదులలో వాడే మంత్రాల వివరణను తెలిపే వచన రచనలు.వీటిని ముందు ముందు వివరించటం జరుగుతుంది.

3).అరణ్యకాలు:- ఆరణ్యకం అనగా అడవులకి సంబంధినది అనిఅర్ధం. ఇది వేదాలలో ఒక భాగం. ఇతిహాస కాలంలో మునుల తత్త్వ విచారణ.యాగ ద్రవ్య పదార్ధ సేకరణ కోసం ఆరణ్యక భాగం ఉపయోగపడుతుంది.

4).ఉపనిషతులు:- వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. 

నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. 
వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. 
వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక శంకరాచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారు.

తరువాతి అంశం వేదాంగాలు మరియు ఉపవేదాలు.

ఇంకా చదవండి »

విద్య & వేదం


విద్య అను పదం వేదం అను పదం నుంచి ఉత్పత్తి చెందింది .విద్ అనగా తెలుపడినది అని అర్ధం.అనగా గురువు నుంచి విద్యార్దికి నేర్పబడ్డది విద్య. భగవంతుడు ఐన పరమేశ్వరుడి నుంచి ఋషులకు తెలుపడింది వేదం.

హిందు ధర్మంలో వేదం అనేది ఒక మౌలిక ప్రమాణం. వేదములను శ్రుతులు అనీ,ఆమ్నాయములు అని అంటారు. శ్రుతి అనగా వినపడుట (శ్రోత అనగా వింటున్న వ్యక్తీ ).
ఆమ్నాయము అనగా "మనన" ప్రక్రియ. ఈశ్వరుడి నుంచి ఉద్భవించిన పదాలను విన్న ఋషులు విన్న వాటిని గుర్తుంచుకొనుటకు మనన ప్రక్రియను అవలంబించి మనస్సునందు నిలుపుకున్నారు. మననం అనగా వల్లె వేయటం. పూర్వ కాలములో వ్రాయుటకు తగు సాధనములు అందుబాటులో లేవు.  కనుక వల్లె వేయుట (మనన ప్రక్రియ) ద్వార వాటిని మనస్సు లో ఉంచుకొనే వారు. 

మనస్సు అనగా మేదస్సు. విన్నవెంటనే గ్రహించే శక్తి. ఎవరైతే ఈ వినినంతనే గ్రహించే శక్తి కలిగి ఉన్నారో వారందరూ వేద విద్యకు అర్హులే. వేదముల నేర్చినంత మాత్రాన వేద విద్య అలవడినట్లు కాదు. అర్ధం తెలియని వేదవిద్య జీవితానికి ఉపయోగపడదు. జీవితానికి ఏది అవసరం,ఏది అనవసరం అని చెప్పి.అవసరం ఐన దానిని సంపాదించుకొనే మార్గాన్ని,శక్తిని,బలాన్ని శారీరకంగాను,మానసికంగాను అందించేది వేదం. 

"విద్" అను దాతువు నుంచి "చే తెలియచేయబడినది" అను పదానికి సంస్కృత అర్ధం అని ముందు చెప్పుకున్నాం. వేదములు భగవంతుని ద్వార తెలుపబడినవి అనీ,అవి ఏ మానవ సముదాయం చేతను వ్రాయబడలేదని విశ్వాసం. అందుకే వేదములను "అపౌరుషేయములు" అంటారు.

అపౌరుషేయములు అనగా "ఎవరిచేతా రచించబడని"వి అని అర్థం.  హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు.  అందుకే వీటిని "శ్రుతులు" అని కూడా అంటారు.

ఈ విదంగ వల్లె వేసే ప్రక్రియ ద్వార వేదాలు తరతరాలకు అందించబడుతూ ఉన్నాయి. వేదాలలో స్వరం ప్రదానం. మొదట వేదాలు అన్ని కలగలిసి ఒకే వేదంగ ఉండేవి. వ్యాసుడు వాటిని సంబంద భాగాలను ఒకచోట చేసి.నాలుగు వేదాలుగ విభజించాడు. తద్వారా వేద వ్యాసుడు అయ్యాడు.  వేదాలు నాలుగు అవి 
ఋగ్వేదం.
యజుర్వేదం,
సామవేదం మరియు అధర్వణ వేదం.

వేదవ్యాసుడి శిష్యులు పైలుడు,జైమిని,సుమంతుడు &  వైశంపాయనుడు. వీరు చతుర్వేదాలను తమ శిష్యులకు భోదించారు. వారు వారి శిష్యులకు భోదించారు. ఇలా గురుశిష్య పరంపరానుగతంగా తరతరాలకు వేదశాస్త్రాలు అందించబడుతున్నాయి.

ఇంకా చదవండి »

సీతాదేవి ఉపదేశించిన శ్రీరామ మంత్రంఇంకా చదవండి »

పంచాక్షరి మంత్రంఇంకా చదవండి »

పూజ సంకల్పం - USA


అమెరికా లో ఉంటున ప్రవాస భారతీయులకి పూజ లో చేపుకోవలసిన దేశకాల సంకీర్తన

తెలుగు లో 

శ్రీ మహావిష్నుర్ఘ్న్య ప్రవర్త మమస్య ఆద్య బ్రాహ్మనః ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే , 
వివస్వత మన్వంతరే , కలియుగే ప్రదమ పాదె , క్రౌంచ ద్వీపే (land of eagle) , రమనక వర్షే , ఇంద్ర ఖండే (empire of indra), రమ్యక పస్చిమదేసే , సప్త సముద్రన్తరే (w.r.t Lord Shiva on Mount Kailash in Himalayas) , సమస్త దేవతా , బ్రాహ్మణ , హరి హర్ద సన్నిధొవ్ , అస్మిన్ వర్తమాన , వ్యావహారిక చాంద్రమానేన _____________ సంవత్సరే , ఉత్తరయనే / దక్షిణాయనే, రుతోవ్ _____ (season) , _____ మాసే (month) , శుక్ల పక్షే / కృష్ణ పక్షే ,  శుభ తిదౌ , వాసరః వసరాస్తూ  _________ , (week name) శుభ వాసరే _________ , (star) శుభ నక్షత్రే __________, శుభ యోగే, శుభ కరనే, ఏవం గుణ విశేషణ విసిష్టయం , శ్రీమాన్ (your name) _________ నామ దేయాహం శ్రీమతః _______ (wife)నామ్న్యం  __________ గోత్రోద్బవస్య , మమ ఉపాత్త దురితక్షయ ద్వార , శ్రీ పరమేశ్వర ముగ్దిస్య , శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం _______________ (eg. Pratah Sandhyam, Ganapathi Pujam, Lakshmi Pujam) కరిష్యే . 

IN ENGLISH 

Sri maha vishnu raagnaya, pravarta manasya, aadya brahmanaha, dwiteeya parardhe, sweta varaha kalpe, vivaswata manwantare, kaliyuge, pradhama paade, KROWNCHA (land of Eagle) dweepe, Ramanaka Varshe, Indra khande (emipre of Indra), Ramyaka Paschimadese (western country), Sapta samudrantare (w.r.t Lord Shiva on Mount Kailash in Himalayas) Samastha devata, brahmana, hari harada sannidhow, asmin vartamana, vyawaharika chandra maanena _____ samvathsare, Uttara aayane (Jan 14 - July 13) or Dakshin aayane (July 14 - Jan 13), _____ ruthow (season), _____ mase (month), Sukla (1day - amavasya) or Krishna (1day - Purnima) Pakshe, ____ Tidhow (day), subha tidhow, Vasaraha vasarastu Ravi = sun, Indu = mon, Bhrugu = Fri, Stira = Sat____ vasare (week name) Subha vaasare, ____ Nakshatre (star), subha nakshatre, subha yoge, subha karane, evam guna visheshana visishtayaam, sriman __(your name) ____ naama dheyaaham, sreemataha ___(Wife name)___ naamnyam, ____ gotrodbhavasya, mama upatta duritakshaya dwara, sri parameswara mugdhisya, sri parameswara preetyardham _________ (eg. Pratah Sandhyam, Ganapathi Pujam, Lakshmi Pujam) karishyee...

as quoted by Chandra Sekhar Bodapati "

ఇంకా చదవండి »

శనిత్రయోదశి రోజున పూజ, జపం

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.

ఏ త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో ఆ రోజు శని గ్రహాన్ని' శనీశ్వరుడు'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు.

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది

సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే ఆ శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు.

ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.

"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం న త్రయోదశి రోజు .

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.

1. తలంటుకుని ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4.శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.

శని మహత్యం

శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! ఆ పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు ఆ బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ఆ ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి ఆ బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి ఆ బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వర జపం

నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం

|| ఓం శం శనయేనమ:||

|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||

|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:

ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||

బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":

||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||

||ఓం శం శనైస్కర్యయే నమః||

||ఓం శం శనైశ్వరాయ నమః||

||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ శ: శనయే నమః ||

||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||

ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం
                                                                          .......వల్లూరి పవన్ కుమార్

ఇంకా చదవండి »

పిల్లలకి వస ఎప్పుడు పోయాలిచిన్నపిల్లలకి వస పోస్తే మంచిదని ఇదివరకువారు పసిపిల్లలకి వస పోసేవారు.  అది ఎందుకు పోయాలో, ఎప్పుడు పోయాలా, ఎలా పోయాలో, ఏ వయసులో పోయాలో సంగతి అటుంచి  అసలు వస అంటే ఏమిటో, దాని ఉపయోగాలేమిటో ఈ కాలం తల్లులకు తెలియచేసే ఉద్దేశ్యమే ఇది. 

వస ఏ ఆయుర్వేద మందులు తయారుచేసే పదార్ధాలుండే షాపులోనైనా దొరుకుతుంది.  దీనిని తీసుకొచ్చి గంధం తీసే సాన మీద 2, 3 చుక్కల నీరువేసి ఈ వసకొమ్ముని దానిమీద మూడుసార్లు తిప్పి దానిని పిల్లలకి నాకించాలి. 

పిల్లలకి 4 – 6 నెలల మధ్య వస పోస్తే మంచిది.  దీనిని 2, 3 సార్లు పోస్తే చాలు.  వసపొయ్యటం ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యకూడదు.  దానికీ  సమయముంది.  ఆదివారంగానీ, బుధవారంగానీ వసపొయ్యాలి.  ఆదివారంనాడుపోస్తే ఆయుష్షు పెరుగుతుందనీ, బుధవారంనాడు పోస్తే మంచి బుధ్ధిమంతులూ, తెలివితేటలుకలవాళ్ళూ అవుతారని అంటారు. 

వసవల్ల ఉపయోగాలు  ..  వోకల్ కార్డ్స్ ని శుభ్రపరుస్తుంది.  స్వరం చక్కగా వస్తుంది.  నాలుక మందంపోయి చక్కగా మాట్లాడతారు.  మేధో శక్తి పెంచుతుంది.  మెదడులో వుండే నరాలని ఉత్తేజపరుస్తుంది.  జీర్ణశక్తి పెంచుతుంది.  క్రిమి సంహారిణిగా కూడా పని చేస్తుంది.  పిల్లలు చురుకుగా చక్కగా పెరిగేటట్లు చేస్తుంది. 

ఇన్ని ఉపయోగాలున్న వసని మీ బిడ్డలకూ ఇవ్వండి.  అయితే తగు మోతాదులో మాత్రమే ఇవ్వాలనే విషయం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. 

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం విన్న తర్వాత)

ఇంకా చదవండి »

ఈ సంవత్సరము ౩1st May, 2016 మంగళ వారము నాడు శ్రీ హనుమజ్జయంతి

హనుమంతుడు వైశాఖ బహుళదశమి, శనివారమునాడు, పూర్వాభాద్ర నక్షత్రమందు, వైధృతి యోగమున, మధ్యాహ్న సమయమునందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతి నక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము. 

హనుమంతుడు తిరుమల కొండపై పుట్టాడు. తల్లి అంజనాదేవి తపస్సు చేసి హనుమంతుని కనుట వలన అది అంజనాద్రి అయినది. పురాణాలలో ఇది పరిశోధించి నిరూపించబడినది. అక్కడే జాబాలి మహర్షి తపస్సు చేయగా స్వామి స్వయంభూమూర్తిగా వెలిశాడు. పాపనాశం వెళ్ళే మార్గంలో ఆకాశగంగకు ముందే జాబాలివద్ద బస్సు దిగి కొద్దిమాత్రపు నడకతో ఆ క్షేత్రము దర్శింపవచ్చు. 

సుందరకాండ పారాయణము 

శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతమైన సుందరకాండ భక్తులపాలిట కల్పవృక్షమన్న అతిశయోక్తి కాదు. అనాదిగా నెట్టి యభీష్టముతో నయినా సుందరకాండ పారాయణ మొనర్చి కోర్కెలను నెరవేర్చుకొనుచున్నారు. పారాయణమునం దనేక విధానములు కలవు. కార్యసిద్ధి, దుష్టగ్రహ, పిశాచక బాధా నివారణ, బంధ విముక్తి, దుస్స్వప్ననాశ, శోకనాశ, రాజ్యలాభ, తాపత్రయ నివారణ, సంపత్సుఖాదుల నెన్నిటినో అనంతములగు ఫలితములను భక్తులు సుందరకాండ పారాయణమువలన పొందుచున్నారు. సుందరకాండ మొత్తమే కాక ప్రతిశ్లోకము కూడా ప్రత్యేక శక్తి కలిగి అనుగ్రహకారియై యున్నది. సుందరకాండయొక్క సర్వఫలితముల దెల్పుట అసాధ్యము. కాన మానములనుభవించు దుఃఖములు తొలగుటకు కొన్ని శాంతులు మాత్రము తెలుపబడుచున్నవి. పారాయణము స్వయముగా చేసికొనవచ్చును లేదా వేరొకరిచే చేయించుకొనవచ్చును. 

ఉన్మాదమునకు శాంతి 

ఉదయకాలమున మినుపపప్పును బాగుగా విసిరి నూక చేసి అన్నముగ వండి శ్రీస్వామివారికి నివేదన చేసి హనుమ ద్విషాదకరమగు సుందరకాండ 13వ సర్గను పారాయణ చేయవలెను. దానిచే మన స్థిమితము లేకపోవుట, దిగులు, పిచ్చి మున్నగు మానసిక వ్యాధులు తొలగును. 

దారిద్య్ర దోష శాంతి 
దారిద్య్ర విమోచనమునకై హనుమంతుడు సీతను చూచిన సుందరకాండ 15వ సర్గ పారాయణము చేయవలెను. 

తప్పిపోయినవారు చేరుటకు 

తప్పిపోయిన, విరోధమందిన వారు మరల కలియుటకు హనుమంతుడు రామ ముద్రికను సీతాదేవి కిచ్చిన 36వ సర్గను త్రికాలములందు పఠించి, పఠనమునకు ముందు, తరువాత కూడా పనస, లేదా మామిడి ఫలములను లేదా సమకూడిన ఫలములను నివేదించవలెను. 


అట్లే సంసారబంధ విముక్తికి నిత్యం 1వ సర్గ ఆరుమాసములు పారాయణ చేయాలి.

భూతప్రేతాది విముక్తికై 3వ సర్గ; 

బుద్ధిమాంద్యం తొలగటానికి 13వ సర్గ; 

సంపదలకు 15వ సర్గ; 

దుస్స్వప్న దోష శాంతికి 27వ సర్గ; 

సత్త్వగుణ వృద్ధికి 20, 21వ సర్గలు; 

ఎడబాసిన బంధువుల కలయికకు 33 నుండి 40వ సర్గ వరకు; 

ఆపదలు తొలగుటకు 36వ సర్గ; 

బ్రహ్మజ్ఞానం కొరకు 38వ సర్గ; 

శత్రుంజయం కొరకు 42 నుండి 47వ సర్గ వరకు;

ధర్మకార్య సాధన, గృహాభివృద్ది కొరకు 54వ సర్గ; 

అభీష్టసిద్ది కొరకు 41వ సర్గ; 

కన్యా వివాహానికి 9రోజులు క్రమంగా 5, 10, 5, 6, 7, 7, 12, 8, 8 పట్టాభిషేక సర్గలు చేస్తూ నివేదనగా నేతితో చక్కెరపొంగలి, పాయసం, అప్పాలు, నువ్వులు కలిపిన అన్నం, చక్కిలాలు, ధధ్యోదనం, లడ్లు, వివిధ ఫలాలు, పొంగలి, చక్కెర కలిపిన పాలు రోజుకొకటిగా నివేదించాలి. 


పుత్రసంతానానికి రోజూ పూర్తికాండ చొప్పున 21 రోజులు చేసి పట్టాభిషేకసర్గ చేయటంకాని, సప్తవర్గపారాయణ 68 దినాలలో పూర్తిచేయటం కానీ చెప్పబడింది. 

రాజబంధ విముక్తికై 34 సర్గలు చొప్పున 68 రోజులు, చివర పట్టాభిషేకసర్గ చేయాలి. 

మహాధన, గృహ, ధాన్యాది లాభములకు 25 సర్గల చొప్పున 68 దినాలు చేసి, చివర పట్టాభిషేకసర్గ చేయాలి. 2 రోజుల పారాయణలో మొదటి రోజు 48 సర్గలు, మిగిలినది మరియు పట్టాభిషేకసర్గ, రెండవరోజు చేసే పధ్దతి ఉన్నది. 3 రోజుల పారాయణలో మొదటిరోజు 27వ సర్గవరకు, రెండవరోజు 40వ సర్గవరకు, 3వ రోజు మిగిలినది మరియు పట్టాభిషేకసర్గ పూర్తిచేయాలి. 5దినాల పారాయణలో 15, 27, 38, 54, 68 వరకు సర్గలను క్రమంగా పూర్తి చేయాలి. 

ధన లాభానికై చేసే 8రోజుల పారాయణలో 7 రోజులు రోజుకి 9 సర్గల చొప్పున చేసి, 8వ రోజు మిగిలిన 5 సర్గలు మరియు పట్టాభిషేకసర్గ చేయాలి. ఇతర అత్యవసర విషయాలు పెద్దలద్వారా గ్రహించి ఆచరించి సత్ఫలితాలు పొందగలరు. 
(Source: శ్రీ హనుమద్విషయ సర్వస్వము) 

ఇంకా చదవండి »